ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్‌కు ముందు టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కంటే.. ముందే.. విరాట్ కోహ్లీకి గాయం అయింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్‌కు టీమిండియా ఒక్క అడుగు దూరంలో నిల్చుంది. దుబాయ్ వేదికగా నేడు (ఆదివారం) జరిగే ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది.

ఈ క్రమంలో టీమిండియాకు బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. ప్రాక్టీస్ సెషన్స్ లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయపడ్డారు. దీంతో ఫైనల్ మ్యాచ్ లో ఆడేది అనుమానంగా మారింది. దీంతో టీమిండియా అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ 2025 లీగ్ మ్యాచ్ లలో ఇద్దరు పేసర్లు, నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది భారత్.. ఫైనల్ మ్యాచ్ లోనూ అదే వ్యూహంతో ముందుకెళ్లే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. న్యూజిలాండ్ కూడా నలుగురు స్పిన్నర్లను బరిలోకి దించే ఛాన్స్ ఉంది. మార్క్ చాప్ మన్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంటుంది.