శంషాబాద్‌లో విమానానికి తప్పిన పెను ప్రమాదం !

-

శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో కలకలం… శంషాబాద్‌లో విమానానికి పెను ప్రమాదమే తప్పింది. శంషాబాద్ నుంచి ప్రయాణికులతో గోవా నుంచి విశాఖపట్నం వెళ్తున్న విమానానికి ల్యాండింగ్‌కు అవకాశం ఇచ్చారు ATC అధికారులు. ల్యాండింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో మరో విమానం టేకాఫ్ అవుతుండడం గమనించి వెంటనే రివర్స్ టేకాఫ్ అయింది.

ATC officials allowed a flight from Goa to Visakhapatnam with passengers from Shamshabad to land.

విమానం గాల్లో పది నిమిషాలు చక్కర్లు కొట్టి సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రమాదం తప్పింది. ఇప్పుడు ఈ సంఘటన హాట్‌ టాపిక్‌ అయింది. దీనిపై అధికారులు ఆరా తీస్తున్నారు. అటు శంషాబాద్‌లో విమానానికి పెను ప్రమాదంపైన ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. సరైన పరిస్థితులు, సౌకర్యాలు లేకనే ఇలా జరుగుతోందని ఆరోపణలు చేస్తున్నారు ప్రయాణికులు.

Read more RELATED
Recommended to you

Latest news