చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత… టిటిడి పాలకమండలిలో సమూల మార్పులు జరుగుతున్నాయి. అదే సమయంలో ఎన్నడు లేని విధంగా అపచారాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా చెన్నైలోని టీటీడీ శ్రీవారి ఆలయ పరకామని లెక్కింపులో అవకతవకలు చోటు చేసుకున్నట్లు గుర్తించారు. తిరుమల శ్రీవారికి సమర్పించిన హుండీ కానుకల్లో చేతివాటం ప్రదర్శించాడు టిటిడి ఉద్యోగి కృష్ణ కుమార్.

తిరుమల శ్రీవారి హుండీ లెక్కింపులో విదేశీ కరెన్సీని స్వాహా చేసినట్లు గుర్తించారు. దీని వెనుక ఉన్నది టీటీడీ సీనియర్ అసిస్టెంట్ కృష్ణ కుమార్ అని తేలింది. విదేశీ కరెన్సీ లెక్కింపులో తేడాలు జరిగినట్లు తాజాగా టీటీడీ విజిలెన్స్ వింగ్ గుర్తించడం జరిగింది. గత సంవత్సరం ఒక నెలలో హుండీలో వచ్చిన ఆరు లక్షల విదేశీ కరెన్సీని స్వాహా చేశాడట కృష్ణకుమార్. విదేశీ కరెన్సీ లెక్కింపులో తేడాలు జరిగినట్లు… టిటిడి విజిలెన్స్ గుర్తించి… టీటీడీ ఈవో శ్యామలరావుకు ఫిర్యాదు చేసింది. ఈ తరుణంలో కృష్ణకుమారును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు టీటీడీ ఈవో శ్యామలరావు.