నాడు నడి ఎండాకాలంలో మత్తళ్ళు దుంకిన చెరువులు.. నేడు నీళ్లు లేక వెలవెలబోతున్నాయి అని పేర్కొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాడు కాలువల నిండా నీళ్లతో ఏడాదికి రెండు పంటలు పండించుకునేందుకు అండగా కేసీఆర్ గారు నిలిచారని తెలిపారు. నేడు ప్రాజెక్టులను పడావుబెట్టి, నీళ్లను ఆంధ్రాకు వదిలి పంటలను కాంగ్రెస్ ఎండబెడుతోందని ఫైర్ అయ్యారు. నాడు సమయానికి రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంట్, సాగునీళ్లు, విత్తనాలు, ఎరువులు, పంటల కొనుగోళ్లతో రైతు కంటినిండా నిద్ర, కడుపు నిండా సంతోషం అన్నారు.
నేడు 15 నెలల కాంగ్రెస్ పాలనలో రైతుభరోసా రాదు, సాగునీళ్లు ఇవ్వరు, కరెంట్ ఇవ్వరు, విత్తనాలు దొరకవు, ఎరువులు ఉండవు, అన్ని గండాలు దాటుకుని పంటలు పండిస్తే కొనుగోళ్లు ఉండవు…. నాడు కేసీఆర్ గారి పాలనలో వ్యవసాయ అనుకూల విధానాలతో పండగలా వ్యవసాయం అని తెలిపారు. నేడు అన్నదాతపై కక్షగట్టి వ్యవసాయాన్ని ఆగంపట్టించిన కాంగ్రెస్ సర్కార్అలంపూర్ నుండి ఆదిలాబాద్ వరకు.. అశ్వారావుపేట నుండి జహీరాబాద్ వరకు.. తిరోగమనంలో వ్యవసాయం ఉందని మండిపడ్డారు.