పుట్టింటి నుంచి కట్నం తేవడం లేదని కట్టుకున్న భార్యపై ఓ భర్త హత్యాయత్నం చేశాడు. అది కూడా అందరూ చూస్తుండగా.. నడిరోడ్డుపై వెంటపడి మరీ కత్తితో దాడికి ప్రయత్నించాడు. అది గమనించిన స్థానికులు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఈ ఘటన నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం గంటాతోపు వద్ద ఘటన చోటుచేసుకోగా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకివెళితే.. రైల్వే కోడూరుకు చెందిన లక్ష్మి ప్రియను శ్రీకాళహస్తికి చెందిన హేమంత్ కుమార్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, పుట్టింటి నుంచి కట్నం తేవాలంటూ కొన్నాళ్లుగా వేధింపులకు గురిచేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే భార్య ప్రియ కట్నం తేవడం లేదని హత్యాయత్నానికి యత్నించాడు. కత్తితో ఆమె మీద దాడి చేయగా.. స్థానికులు అడ్డుకుని బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు.