400 మంది ఉద్యోగాలు ఊస్ట్.. సజ్జన్నార్‌పై ఎంప్లాయీస్ ఫైర్

-

ఆర్టీసీ ఉద్యోగులు ఎండీ సజ్జన్నార్‌పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్న చిన్న తప్పులకు గాను తమను నేరుగా ఉద్యోగాలు తీసివేయడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పులు చేస్తే సరిదిద్దాలి గానీ, ఇలా ఏకంగా ఉద్యోగాలు తొలగిస్తే మేము.. మా కుటుంబం ఏం కావాలని హన్మకొండకు చెందిన ఓ మహిళా కండక్టర్ రోదించారు.

కాగా, ఇటీవల విధి నిర్వహణలో భాగంగా పొరపాట్లు చేసిన సుమారు 400 మంది ఆర్టీసీ ఉద్యోగులను తొలగించిన టీజీఎస్ఆర్టీసీ తొలగించినట్లు సమాచారం. ‘పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సజ్జనార్ గారు మాపై పడ్డారు. చిన్న చిన్న పొరపాట్లకు మమ్మల్ని ఉద్యోగంలో నుంచి తొలగించి..మా కుటుంబాలను రోడ్డున పడేశాడని’ మహిళా కండక్టర్‌తో పాటు మిగతా ఉద్యోగులు వాపోయారు.

https://twitter.com/TeluguScribe/status/1899387938963628238

Read more RELATED
Recommended to you

Latest news