మెదక్ ఎంపీ రఘునందన్ రావు కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. నాగార్జున సాగర్ లో రఘునందన్ రావు పై నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. 2021 లో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావు పై FIR నమోదు చేశారు. మోడల్ కోడ్ అమలులో ఉండగా.. అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించారని ఫిర్యాదు చేశారు. ఉట్లపల్లి, పులిచెర్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. MPDO దుబ్బ సత్యం ఫిర్యాదు మేరకు రఘునందన్ రావు పై కేసు నమోదైంది. ఈ కేసును తాజాగా హైకోర్టు కొట్టేసింది.
ఇదిలా ఉంటే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకారణ మరణం చెందిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ 2021లో ఉప ఎన్నిక నిర్వహించారు. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ 18,872 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఈ ఎన్నికల్లో ఓడిపోవడం గమనార్హం.