ఏపీలోనూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వైఫ్యల్యాలపై వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తున్నది. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తుండగా.. ప్రభుత్వం మాత్రం జగన్కు ప్రతిపక్షం ఇచ్చే అన్ని సీట్లు రాలేదని అంటోంది. దీంతో ఇరు పార్టీలకు మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది.
ఈ క్రమంలోనే బుధవారం ఉదయం మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ..‘ప్రతిపక్షంలో ఉండటం మనకి కొత్త కాదు.. కళ్లు మూసి తెరిచేసరికి సంవత్సరం అయిపోయింది.ఇంకో మూడు ఏళ్లలో వచ్చేది మన ప్రభుత్వమే’ అని మాజీ సీఎం జగన్ అన్నారు. ఆయన వెంట లక్ష్మీ పార్వతి, ఇతర మహిళా నేతలు ఉన్నారు.