SLBC టన్నెల్‌లో కనిపించకుండా పోయిన సిబ్బంది కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా టన్నెల్ వద్దకు హైదరాబాద్ ANVI రోబోటిక్స్‌కు చెందిన మూడు రోబోలు చేరుకున్నాయి. మాస్టర్ రోబో ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు.
కమ్యూనికేషన్ రోబోతో టన్నెల్ లోపలికి వెళ్లిన రోబోల ద్వారా రోబోటిక్ బృందం రెస్క్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. లోకో ట్రైన్‌లో రోబోలను అధికారులు కొద్దిసేపటి కిందటే లోపలికి తీసుకువెళ్లినట్లు సమాచారం. కాగా, మృతదేహాలను ఇప్పటికే గుర్తించిన అధికారులు వాటిని వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు.