వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ తను తల్లిని అనే విషయం కూడా మర్చిపోయింది. ప్రియుడి మోజులో పడి బంగారం లాంటి ఇద్దరు పిల్లలను ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్లిపోయింది.ఈ హృదయ విదారక ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సాతరం గ్రామంలో గురువారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాల్లోకివెళితే.. సాతరం గ్రామానికి చెందిన నరేష్‌తో దివ్యకు వివాహం జరిగింది. కాగా, రోడ్డు ప్రమాదంలో ఇటీవల నరేష్ మృతి చెందాడు. దీంతో తక్కువ రోజుల్లోనే వేరే వారితో దివ్య అక్రమసంబంధం పెట్టుకున్నది. ఈ క్రమంలోనే అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రిలో దివ్య తండ్రి మురళి చేరాడు. తనతండ్రిని చూడడానికి వచ్చిన దివ్య.. తండ్రితో గోడవపడి ఇద్దరు పిల్లలను కూడా అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. దీంతో పిల్లలు అమ్మమ్మ, తాత వద్దనే ఉంటున్నట్లు తెలిసింది.
కన్న పిల్లలను ప్రభుత్వ ఆసుపత్రిలో వదిలేసి వెళ్లిన కసాయి తల్లి
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మడలం సాతరం గ్రామానికి చెందిన నరేష్‌తో దివ్యకు వివాహం కాగా రోడ్డు ప్రమాదంలో నరేష్ మృతి చెందాడు. దీంతో వేరే వారితో అక్రమసంబంధం పెట్టుకొని పిల్లలను వదిలేసి వెళ్లిన తల్లి దివ్య. అనారోగ్యంతో… pic.twitter.com/lWkmVLpR1d
— ChotaNews App (@ChotaNewsApp) March 13, 2025