తెలంగాణ అసెంబ్లీలో యుద్ధవాతావరణం నెలకొంది.స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సభలో కాంగ్రెస్ సభ్యులు వాగ్వాదానికి దిగారు.స్పీకర్‌కు సభ సాక్షిగా క్షమాపణలు చెప్పాలని మంత్రులు,ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే తమ సభ్యుడు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు క్లారిటీ ఇచ్చారు. స్పీకర్ ప్రసాద్‌ను జగదీశ్ రెడ్డి అవమానించలేదని, ‘సభ మీ ఒక్కరిది కాదు..అందరిది అని’ మాత్రమే అన్నారని స్పష్టంచేశారు. ‘మీ’ అనే పదం సభ నిబంధనలకు విరుద్ధం కాదన్నారు. అసలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు నిరసన తెలిపారో, సభను ఎందుకు వాయిదా వేశారో తెలియడం లేదని హరీశ్ రావు విమర్శించారు. స్పీకర్ ప్రజాస్వామ్యబద్ధంగా పని చేయకపోతే అవిశ్వాసం పెడతామని హరీశ్ రావు స్పష్టంచేశారు.