కారుతో ఢీకొట్టి వ్యక్తిపై హత్యాయత్నం.. గోడ మీద తలకిందులుగా వేలాడిన మహిళ

-

కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది.తన పొరుగింట్లో ఉండే మురళీ ప్రసాద్ అనే వ్యక్తిని కారుతో గుద్ది చంపాలని సతీశ్ అనే వ్యక్తి ప్రయత్నించాడు. ప్లాన్ ప్రకారం బైక్ మీద వెళ్తున్న మురళిని కారులో వేగంగా వచ్చి సతీశ్ ఢీకొట్టాడు.అయితే, మురళిని ఢీకొడుతున్న సమయంలో అటుగా నడిచివెళ్తున్న మహిళను కూడా సతీశ్ డ్యాష్ ఇచ్చాడు.

ఈ ప్రమాదంలో సదురు మహిళ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి ఓ ఇంటి గోడ మీద పడింది. అనంతరం ఆమె కాలికి ఉన్న చెప్పు ఐరన్ గ్రిల్స్ కు చిక్కుకుపోవడంతో అలానే తలకిందులుగా వేలాడింది.స్థానికులు ఆమెతో పాటు మురళికృష్ణను రక్షించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మురళితో పాటు మహిళకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సతీష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.గతంలో మురళి తండ్రిపైనా సతీష్ హత్యాయత్నం చేసినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news