గవర్నర్ బడ్జెట్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం అనంతరం సీఎం రేవంత్ ప్రతిపక్ష బీఆర్ఎస్ శాసన సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని గులాబీ పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో విరుచుక పడ్డారు.
గత డిసెంబర్ నుంచి ఇప్పటివరకు కేసీఆర్ రూ.57 లక్షల జీతభత్యాలను ప్రభుత్వం నుంచి పొందారని, ప్రతిపక్ష నాయకుడి హోదాలో శాసనసభకు వచ్చింది మాత్రం రెండు సార్లే అని రేవంత్ రెడ్డి సభా ముఖంగా ప్రకటించారు. ప్రభుత్వ జీతభత్యాలు తీసుకుని రాష్ట్రాన్ని ఖర్మకు వదిలేసిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆరే అని ఆయన విమర్శించారు.