కులానికి ఎక్కడా స్టేచర్ ఉండదని.. మీరుకు మీరుగా స్టేచర్ను ఆపాదించుకోవద్దని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. గవర్నర్ ని గౌరవించడం లేదని.. స్పీకర్ స్పీకర్ను బీఆర్ఎస్ నేతలు గౌరవించడం లేదని కామెంట్ చేశారు. ఎందుకిలా బరితెగిస్తున్నారని మండిపడ్డారు. అజ్ఞానాన్నే విజ్ఞానం అనేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. కులానికి ఎక్కడా స్టేచర్ ఉండదని.. పదవికి మాత్రమే స్టేచర్ ఉంటుందని, వ్యక్తికి కూడా కాదని తెలిపారు. ఇక మీదట ఫామ్హజ్లలో డ్రగ్స్ పార్టీలను ఉపేక్షించబోమని అన్నారు.
దుబాయ్ లో ఏం జరిగిందో వివరాలు తెప్పించాం. దుబాయ్ లో ఏం జరిగిందో అన్ని వివరాలు తెప్పించామంటూ నిర్మాత కేదార్ మృతికి సంబంధించి ఆయన సభలో ప్రస్తావించారు. ఆ నాయకుడు సభకు వచ్చాక అన్నీ బయటపెడతామని అన్నారు. బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లతోనే తాము ఉద్యోగాలు ఇచ్చామని అంటున్నారని, ప్రక్రియ మొత్తం పూర్తి చేసి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. మొదటి ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర తమ సర్కారుకే దక్కిందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గిందని ఇటీవల వచ్చిన నివేదికలు చెబుతున్నాయని కామెంట్ చేశారు.