ఓయూలో విద్యార్థుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం : హరీశ్ రావు

-

ఓయూలో నిరసనలు, ఆందోళనలు నిర్వహించొద్దని రిజిస్ట్రార్ జారీ చేసిన సర్క్యులర్ మీద విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు ఒక్కసారిగా కన్నెర్ర చేశారు. ఈ క్రమంలోనే వారిని పోలీసులు అరెస్టు చేయగా.. సోమవారం ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు.

‘పోరాటాల పురిటిగడ్డ, తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ వంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలు విధించడం అప్రజాస్వామికం. నిరసన తెలిపే హక్కును హరిస్తూ ఆంక్షలు విధించడం అమానుషం. ఇది పూర్తి రాజ్యాంగ విరుద్ధమైన చర్య.
ఓయూలో విద్యార్థుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం.నిరసన హక్కు ప్రతి పౌరుడికి ఉన్న ప్రాథమిక హక్కు అన్న సంగతి కాంగ్రెస్ ప్రభుత్వం మరిచి వ్యవహరిస్తున్నది.

విద్యార్థులను అణచివేయడం మాని, వారి సమస్యలు వినాలి, తక్షణం పరిష్కారం చూపాలి.ఆంక్షల ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని, అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమ స్పూర్తిని మళ్లీ తుంగలో తొక్కాలనే కుట్ర జరుగుతోంది.విద్యార్థుల, యువత ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడాన్ని బీఆర్ఎస్ ఎప్పటికీ సహించదు’ అని రాసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news