ప్రముఖ రచయిత కన్నుమూత.. రాజమౌళి ఎమోషనల్ పోస్ట్

-

ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు చోటుచేసుకుంటున్నాయి. రీసెంట్ గానే  మలయాళ ప్రముఖ రచయిత మంకొంబు గోపాలకృష్ణన్  చనిపోయారు. గత కొన్ని రోజులుగా గోపాలకృష్ణన్ అనారోగ్య సమస్యలతో బాధపడి.. నిన్న మధ్యాహ్నం ఆయన కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్  కారణంగా మంకొంబు గోపాలకృష్ణ ప్రాణాలు కోల్పోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికన సంతాపం తెలుపుతున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి ట్విట్టర్ వేదికన మంకొంబు గోపాలకృష్ణన్ మరణం పట్ల ప్రగాఢ
సంతాపం వ్యక్తం చేశారు.

“ప్రముఖ మలయాళ రచయిత మంకొంబు గోపాలకృష్ణన్ సర్ మరణవార్త విని బాధగా ఉంది. ఆయన కలకాలం గుర్తుండిపోయే సాహిత్యం, కవిత్వం, సంభాషణలు శాశ్వత ముద్ర వేశాయి. ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ మలయాళ వెర్షన్లలో ఆయనతో కలిసి పని చేసినందుకు కృతజ్ఞతలు. ఓంశాంతి” అంటూ జక్కన్న సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. 

Read more RELATED
Recommended to you

Latest news