ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన శాసనసభలో మాట్లాడారు. అప్లయ్.. అప్లయ్ నో రిప్లయ్ అన్న చందంగా ఇక్కడ నడుస్తోందన్నారు. తనకు తెలియకుండానే తన నియోజకవర్గంలోని ఓ ఈద్గా గ్రౌండ్ వద్ద సబ్ స్టేషన్ కి శంకుస్థాపన చేసారని.. నా రెగ్యులర్ స్టైల్ లో వెళ్లి పగులగొట్టాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే స్థలానికి పక్కన ఉన్న మరికొంత స్థలంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కోసం ల్యాండ్ ఇవ్వమంటే అధికారులు ఇవ్వలేకపోయారని తెలిపారు. కానీ ఆ పక్కనే ఉన్న ఈద్గా గ్రౌండ్ లో లోకల్ ఎమ్మెల్యేను నా దృష్టికి తేకుండానే సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు.
అలాగే మిడ్ డే మీల్స్ లో విద్యార్థులకు ఎగ్స్ ఇవ్వడం లేదని.. ఆ పిల్లలకు ఎగ్స్ ఇవ్వాలని ప్రశ్నించారు. నా నియోజకవర్గం పరిధిలోని అంశాలపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని నోట్ చేసుకుంటామని చెప్పడం కాదన్నారు. నాకు ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు.. నాకు తెలుసు ఏం మాట్లాడాలో తెలుసు.. మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలిచానంటూ సంచలన కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో చిన్న పత్రికలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఫోన్ చేసినా స్పందించరు.. కానీ సోసల్ మీడియా పర్సన్స్ ఫోన్ చేస్తే.. మాత్రం భయపడుతున్నారని తెలిపారు.