తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనాలకు 18 గంటల సమయం పడుతోంది. తిరుమలలో తాజాగా 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనాలకు 18 గంటల సమయం పడుతోంది. అటు నిన్న 65487 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 23909 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే… హుండీ ఆదాయం 4.75 కోట్లుగా నమోదు అయింది.

అటు తిరుమలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పయనం కానున్నారు. రేపు, ఎల్లుండి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటనకు వెళతారు. ఇందులో భాగంగానే… రేపు రాత్రి తిరుమల చేరుకోనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎల్లుండి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులతో కలసి శ్రీవారిని దర్శించుకోనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం ఒక్కరోజు విరాళం అందించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి.