నేడే తెలంగాణ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. తెలంగాణ ప్రభుత్వం నేడు అంటే బుధవారం రెండోసారి శాసనసభసలో సంపూర్ణ బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మొత్తం రూ.3 లక్షల కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది.

బుధవారం ఉదయం 11 గంటలకు శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలిలో మంత్రి శ్రీధర్‌బాబు 2025-26 ఆర్థిక సంవత్సరానికి పద్దును ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.