డయాబెటిస్ ఉందా..? అయితే ఈ కంటి సమస్యలు వస్తాయి చూసుకోండి..!

-

దీర్ఘకాలిక సమస్యలలో డయాబెటిస్ కూడా ఒకటి. అయితే ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా డయాబెటిస్ సమస్యతో చాలా శాతం మంది బాధపడుతున్నారు. ఎప్పుడైతే రక్తంలో చక్కర స్థాయిలు పెరుగుతాయో ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంతేకాకుండా కళ్ళ ఆరోగ్యం పై కూడా డయాబెటిస్ ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ప్రతిరోజు డయాబెటిస్ కు సంబంధించి మందులను వాడి రక్తంలో చక్కర స్థాయిలను కంట్రోల్ చేసినా సరే కళ్లకు సంబంధించి కూడా మెడిటేషన్ ను తీసుకోవాలి. డయాబెటిస్ వలన కళ్ళు దెబ్బతినే అవకాశాలు కూడా ఉంటాయి అని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా కంటి ఆరోగ్యానికి హాని చేసేటువంటి పనులను అస్సలు చేయకూడదు. సహజంగా డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు గ్లకోమా వంటి కంటి వ్యాధులను ఎదుర్కొంటారు. అయితే ఈ సమస్య ఏర్పడినప్పుడు కళ్ళ నరాలు దెబ్బతింటాయి. ఈ విధంగా పూర్తి దృష్టి కూడా పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక డయాబెటిస్ ను నియంత్రించుకుంటేనే ఈ సమస్య ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా రెటీనా మధ్య భాగంలో ఉండే మాక్యుల డయాబెటిస్ వలన వాపు కలుగుతుంది. దాంతో సరైన దృష్టి ఉండదు. ఇటువంటి లక్షణాలను ఎదుర్కొన్నప్పుడు తప్పకుండా వెంటనే చికిత్స తీసుకోవాలి.

సహజంగా కంటి శుక్లాలను కొంత శాతం మందిని ఎదుర్కొంటారు. ముఖ్యంగా డయాబెటిస్ వారికి కంటి శుక్లాలు సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే డయాబెటిస్ ను ఎదుర్కొంటారో రెటీనాలోని చిన్న రక్త కణాలు కూడా దెబ్బతింటాయి. దాంతో సరిగ్గా చూడడానికి కూడా కష్టం అవుతుంది. ఈ సమస్యను డయాబెటిక్ రెటినోపతి అని అంటారు. డయాబెటిస్ తో బాధపడే వారి కంటి ఆరోగ్యం దెబ్బ తినడానికి కారణం కంటి నరాలు బలహీనతే అని వైద్యులు చెప్పడం జరిగింది. పైగా ఎప్పుడైతే డయాబెటిస్ సమస్యను ఎదుర్కొంటారో కంటి నుంచి రక్తస్రావం కూడా జరుగుతుంది. ఈ విధంగా ఎన్నో కంటి సమస్యలు వస్తూ ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news