మూడు రోజులుగా కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి చెరువులో శవమై కనిపించాడు. ఈ ఘటన ఉమ్మడి మెదక్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. మనోహరాబాద్ మండల పరిధిలోని రంగయ్యపల్లి గ్రామానికి చెందిన మన్నె అజయ్ కుమార్.. మూడు రోజుల క్రితం గ్రామ చెరువు చింతల కుంట చెరువులో చేపల వేటకు వెళ్లాడు.
అయితే, చేపలు పట్టే క్రమంలో ఆ చెరువులోనికి దిగి గల్లంతు అయ్యాడు. మూడు రోజులుగా ఎంత గాలించినా అతని ఆచూకీ లభించలేదు. కాగా, నేడు ఉదయం చెరువులో శవమై తేలడంతో స్థానికులు మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.