వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శుక్రవారం ఉదయం తన శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి తుమ్మల అధ్యక్షతన వ్యవసాయ శాఖ అధికారులతో సచివాలయంలో సన్నాహాక సమావేశం ఏర్పాటు చేయగా.. సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలోని అన్ని విత్తన కంపెనీలు, వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశంలో భాగంగా రాబోయే వానాకాలంలో అవసరమైన విత్తనాల లభ్యత, కంపెనీల పనితీరు, విత్తనాల కొరత ఏర్పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం పంట ఎంత మొత్తంలో వేశారు? ఎంత దిగుబడి రానుంది? నీటి ఎద్దడి కారణంగా పంట నష్టపోయిన రైతుల వివరాలను సైతం సేకరించాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సమాచారం.