బెట్టింగ్ యాప్స్ కేసు.. హైకోర్టులో విష్ణుప్రియకు షాక్

-

బెట్టింగ్ యాప్స్ పై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వీటిని ప్రమోట్ చేసి యువత జీవితాలు నాశనం కావడంలో పరోక్షంగా భాగమైన సెలబ్రిటీలకు షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో పలువురు ప్రముఖులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరికొందరిపై కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో పలువురిని అధికారులు విచారించారు. అయితే ఈ వ్యవహారంలో యాంకర్, నటి విష్ణుప్రియపై కూడా కేసు నమోదయింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో విష్ణుప్రియపై ఫిర్యాదు నమోదైంది.

ఈ నేపథ్యంలో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేయగా ఆమె హైకోర్టును ఆశ్రయించింది. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని విష్ణుప్రియ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో పోలీసుల దర్యాప్తుపై స్టే విధించాలని కోరారు. అయితే ఈ వ్యాజ్యంపై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు ఎఫ్ఐఆర్ కొట్టివేసేందుకు, స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని విష్ణుప్రియను ఆదేశించింది. చట్టప్రకారం దర్యాప్తు కొనసాగించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news