ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అలజడి చెలరేగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నీలం సాహ్ని దీర్ఘకాలిక సెలవులో వెళ్ళిపోయే ఆలోచనలో ఉన్నారు అనే ప్రచారం ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో జోరుగా జరుగుతుంది. ఆరునెలలు సర్వీసు ఉండగా జగన్ కోరిక మేరకు ఆమె ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. జగన్ కూడా ఆమెకు ఉన్న ట్రాక్ రికార్డ్ చూసి పదవిలో కూర్చోబెట్టారు.
అంత వరకు బాగానే ఉంది గాని ఇటీవల ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఆర్ఎస్ అధికారిగా ఉన్న జాస్తి కృష్ణ కిషోర్ వ్యవహరంలో క్యాట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్తవానికి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో సియేస్… కృష్ణ కిషోర్ పై సస్పెన్షన్ వేటు వేసారు. ఇక ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్న నేపధ్యంలో అమరావతి ధాటి వెళ్ళవద్దని ఆదేశాలు కూడా జారి చేసారు.
దీనిని జాస్తి కృష్ణ కిషోర్ క్యాట్ లో సవాల్ చేసారు. దీనిపై స్పందించిన క్యాట్ ఆయనపై విధించిన సస్పెన్షన్ ని ఎత్తి వేసింది. ఇక ఇటీవల విచారణ జరగగా…సియేస్ వచ్చి సమాధానం చెప్పాలని క్యాట్ ఆదేశాలు జారి చేసింది. అలాగే ఆయనకు వేతనం చెల్లించలేదు ప్రభుత్వం. దీనిపై కూడా సియేస్ తీరుని క్యాట్ తీవ్రంగా తప్పుబట్టింది. ఇన్నాళ్ళు ఆయనకు ఎందుకు వేయలేదని ప్రశ్నించింది.
ఇక ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా ఆమె మెడకు చుట్టుకున్నాయి అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. దీనితో సహాని ఇప్పుడు దీర్ఘ కాలిక సెలవులో వెళ్ళే ఆలోచనలో ఉన్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఆమె తన సన్నిహితుల వద్ద కూడా ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. జాస్తి కృష్ణకిషోర్ వ్యవహారం ఆమెకు మెడకు చుట్టుకోవడంతో అధికారులు ఇప్పుడు భయపడుతున్నారట.