ముందే క్షమించండి అని అడుగుతున్నా కాబట్టి టైటిల్ చూసి సీరియస్ అవ్వొద్దు. మొత్తం చదివిన తర్వాత కోపం వస్తే సీరియస్ అవ్వండి. తన ప్రాణాలే నీవని అర్దేచగా, తన మనసంతా నీదేనని మొక్షేచగా, తన వలపు అంతా నీకే కామేచగా… ఒక స్త్రీ ఒక మగాడ్ని నమ్మి వస్తుంది. అంటే తన ప్రాణం, జీవితం అన్నీ నీ చేతుల్లోనే. నువ్వే తన ప్రపంచం అనే కదా 20 ఏళ్ళు పెంచిన అమ్మా నాన్నని కాదని తాళి కట్టావని నీ వద్దకు వస్తుంది.
అలాంటి భార్యకు భర్త నమ్మకం ఇవ్వాలా…? అసలు ప్రత్యేకంగా నువ్వు నమ్మకం ఇవ్వాలా…? అదే కలగాలి. కాని ఒక సంఘటన విన్న తర్వాత మా అభిప్రాయం మారిపోయింది. భార్య అనారోగ్యంతో ఉందని, సైనేడ్ పెట్టి చంపేసాడు తాళి కట్టినవాడు. నువ్వు అనారోగ్యంతో ఉంటే, నీ బట్టలు ఉతికి, నువ్వు వంతు చేసుకుంటే శుభ్రం చేసి, అనకూడదు గాని నీ ముడ్డి కడిగి మూతి కడిగి సేవలు చేస్తుంది భార్య.
అలాంటి భార్యకు అనారోగ్యం వస్తే నువ్వు సేవ చెయ్యాలి, లేదా ఎవరి సహాయం అయినా తీసుకోవాలి. అదే నీ కన్న కూతురు అయితే చంపేస్తావా…? నీ దగ్గర తాను క్షేమం అనే కదా వచ్చింది…? నీ దగ్గర తన జీవితంతో పాటు ప్రాణం కూడా భద్రం అనే కదా వస్తుంది. అందంగా ఉందో, రోగంతో ఉందో కట్టుకున్నావ్, ప్రేమించాలి, లేదా తన జీవితాన్ని కాపాడాలి. ప్రేమిస్తావో లేదో నీ ఇష్టం.
కాని తన ప్రాణం మాత్రం ఉండాలి కదా…? నువ్వు ఉన్నావనే కదా నాన్న అనే పిలుపుకి, అమ్మ అనే పిలుపుకి, అక్క, అన్నయ్య, చెల్లెలు అనే పిలుపులకు దూరమై వస్తుంది. అలాంటి భార్యను పోలీసులే భయపడే విధంగా చంపేసావు అంటే భార్య… భర్త దగ్గర ఎంత మాత్రం క్షేమంగా ఉంటుంది చెప్పు…? సమాజం అయినా సరే మారాలి. మానవ విలువలతో బ్రతకాలి. జాగ్రత్తగా చూసుకోకపోయినా పర్వాలేదు, చంపకు…!