నెల్లూరులో జరిగిన సాగునీటి సలహా బోర్డు సమావేశంలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేసారు. సోమశిల, కండలేరు జలాశయాల నుంచి 140 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. మొత్తం 8 లక్షల ఎకరాలకి పైగా నీరు అందిస్తాం అని తెలిపారు. అయితే జగన్ ప్రభుత్వ హయాంలో కాలువల్లో పూడిక కూడా తీయలేదు. కానీ బిల్లులు మాత్రం చేసుకున్నారు.
ఇప్పుడు డ్రోన్ కెమెరాలతో కాలువలన్నీ చిత్రీకరించమని అధికారులను ఆదేశించాము. జిల్లాలో పలు కాలువలను ఆక్రమించారు అని తెలిపారు. అయితే కొన్ని రోజుల కిందట విజయవాడలో భారీ వర్దలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వరదలకు బుడమేరులో జరిగిన ఆక్రమణలే కారణం అని మంత్రి అన్నారు. అందుకే ఆపరేషన్ బుడమేరు చేపట్టమని సీఎం ఆదేశాలిచ్చారు అని పేర్కొన మంత్రి నారాయణ.. జగన్ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ శాఖలో జరిగిన అవినీతిపై కూడా విచారణ చేపడతాం అని స్పష్టం చేసారు.