వైసిపి పార్టీ సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి విశాఖపట్టణం ఇన్చార్జిగా వ్యవహరిస్తూనే మరోపక్క విశాఖపట్టణం లో ఖాళీగా ఉన్న భూముల పైన కన్ను వేసినట్లు గత కొంత కాలం నుండి వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా విశాఖపట్నంలో మున్సిపల్ అధికారుల చేత ఖాళీగా ఉన్న భూముల వివరాలను కూడా అధికారుల దగ్గర నుండి వివరాలు రాబట్టినట్లు మొన్నటిదాకా వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా విజయసాయిరెడ్డి విశాఖ పట్టణంలో భారీ భూదోపిడీ చేసినట్లు..పట్టాభి అనే వ్యక్తి ఆరోపించారు. ప్రభుత్వ జీవోలు పాస్ చేస్తూ మరి విశాఖపట్టణం లో భారీ ఎత్తున కొన్ని వేల ఎకరాలు విజయసాయిరెడ్డి భారీ భూదోపిడీ చేశారని పేర్కొన్నారు. జీవోనెం-72 ద్వారా విశాఖపట్టణంలో 2,400ఎకరాల స్కామ్ జరిగిందని, అందుకు మూలకారకుడు విజయసా యిరెడ్డేనని, జీవోనెం-72లో ప్రత్యేకంగా విశాఖనగరాన్నే ఎందుకు చేర్చారని, ప్రభుత్వ మిచ్చిన జీవోలద్వారా విజయసాయి భూభాగోతం పట్టాభి బట్టబయిలు అయిందన్నారు.
ఈ విధంగానే కృష్ణా మరియు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో కూడా జగన్ ప్రభుత్వం భూములు తీసుకుంటుందని పట్టాభి ఆరోపించారు. విశాఖపట్టణం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ముసుగులో భారీ స్థాయిలో వైసిపి పార్టీ పెద్దలు భయంకరంగా భూములు దోచేస్తున్నారని ఆరోపించారు.