ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలను చూసి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీలం సహాని తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం ప్రభుత్వ అధికార వర్గాల్లో బాగా వినబడుతోంది. ఆమె తిరిగి ఢిల్లీకి వెళ్లి పోవాలనే ఆలోచనలో ఉన్నట్లు అతిపెద్ద నిజం ఇటీవల బయటపడింది. ముఖ్యంగా రాజధాని తరలింపు మరియు ఇంగ్లీష్ మీడియం విషయంలో హైకోర్టు స్పష్టమైన హెచ్చరికలు ప్రభుత్వానికి చేసినా గాని ఆదేశాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఏపీ సి.ఎస్ నీలం సహాని కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అంతేకాకుండా జగన్ ప్రభుత్వం చాలా విషయాలలో చాలా మొండిగా వ్యవహరించటం నీలం సహాని కి నచ్చనట్లు దీంతో ఏం చేయలేని పరిస్థితిలో నిస్సహాయ స్థితిలో ఏపీ పరిపాలన ఉండటం తో ఆమె తిరిగి ఢిల్లీ వెళ్లి పోవాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు గట్టిగా వినబడుతున్నాయి.
అంతేకాకుండా చాలావరకు చట్టవ్యతిరేకమైన పనులు ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నట్లు ఇందువల్లనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. చీఫ్ సెక్రటరీగా చేయాల్సిన పనులు కూడా ముఖ్యమంత్రి కార్యాలయం చేయటంతో ఆమె చాలా మనస్థాపానికి గురైనట్లు ఏపీ మీడియా వర్గాల్లో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. అయితే వస్తున్న ఈ వార్తల్లో అసలు నిజం లేదని అవన్నీ పుకార్లే కేవలం ఆమె వ్యక్తిగత పర్సనల్ పనులకు సంబంధించి ఢిల్లీ వెళ్లడానికి నీలం సహాని రెడీ అయినట్లు ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.