చాలా మందికి గాడ్జెట్స్ అంటే పిచ్చి. అలాగే వాహనాలు అంటే కూడా పిచ్చి ఉంటుంది. అవసరం ఉన్నా లేకపోయినా సరే కొనుగోలు చేస్తూ ఉంటారు. కొత్త మోడల్ వచ్చిన ప్రతీ సారి కూడా న్యూ మోడల్ ఉండాలి అనే ఆత్రంతో అప్పులు చేసి అయినా సరే కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. అయితే ఆ అలవాటు ఆ పిచ్చి అసలు ఆ వ్యసనం ఎంత మాత్రం మంచిది కాదు అనేది పలువురి అభిప్రాయ౦.
ఎందుకంటే వాటి మీద పెట్టిన ఏ రూపాయి కూడా వెనక్కు వచ్చే అవకాశం ఉండదు. డబ్బులు ఉన్న వాళ్ళు పెట్టినా ఒక అందం ఉంటుంది కాబట్టి మిడిల్ క్లాస్ మాత్రం వాటికీ దూరంగా ఉండటం చాలా ఉత్తమం అనేది చాలా మంది అభిప్రాయ౦. లోన్ తీసుకుని కొనుగోలు చేస్తూ ఉంటారు. దాని వలన తాత్కాలిక ఉపయోగమే గాని లాంగ్ రన్ లో ఏ ఉపయోగం ఉండే అవకాశం లేదు.
లక్ష రూపాయలు పెట్టి కొన్న ఫోన్ కి కొత్త మోడల్ వస్తే దాని ధర సగానికి సగం పడిపోవడమే కాకుండా దాన్ని మీరు ఏ విధంగాను ఆర్ధిక వనరుగా చూడలేరు. భవిష్యత్తు మరింత కష్టమయ్యే అవకాశం ఉందీ అనేది స్పష్టంగా అర్ధమవుతుంది. కాబట్టి ప్రతీ రూపాయిని ఇప్పుడు మీరు జాగ్రత్తగా దాచుకోవాల్సిన అవసరం ఉంది. కారు లోన్, క్రెడిట్ కార్డులో స్మార్ట్ ఫోన్ కొనవద్దు.
వాటి విలువ ఎప్పటికప్పుడు పడిపోవడమే గాని పెద్దగా ఉపయోగం ఉండదు. అదే విధంగా వస్తువుల మీద కూడా పెద్దగా పెట్టుబడులు పెట్టడం అనేది నష్టమే గాని లాభం ఉండదు. కాబట్టి బంగారం వంటివి కొనుగోలు చేయడం ఉత్తమం. లేదా పెట్టుబడులు పెట్టడం మంచి రంగాలను చూసుకుని చాలా ఉత్తమం. ప్రతీ రూపాయిని విలువగా చూసుకోండి. ఏ బ్రాండ్ అయినా సరే ధర పడిపోవడం అనేది పక్కా కాబట్టి ఆ విధంగా వ్యవహరించండి.