పిల్లలకు సద్ది అన్నం పెట్టవద్దు..!

చిన్న పిల్లల ఆరోగ్యం చాలా సున్నితంగా ఉంటుందనేది అందరికి తెలిసిన విషయమే. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. వారికి అరుగుదల అనేది చాలా తక్కువ కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తేడా వస్తే వాళ్ళ ప్రాణానికే ప్రమాదం అంటున్నారు వైద్యులు. అసలు పిల్లలకు ఆహారం పెట్టే సమయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి.

ఆహారం పెట్టే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవడం అనేది కచ్చితంగా చెయ్యాలి. అలాగే పిల్లలకు ఆహారం పెట్టేటప్పుడు హడావిడిగా పెట్టకుండా… ఎత్తుకుని అటూ ఇటూ తిప్పుతూ పెట్టాలని అంటున్నారు. పిల్లలకు కాచి చల్లార్చిన శుభ్రమైన నీటిని మాత్రమే తాగించడం అనేది ఉత్తమం. వారికి పొలమారితే కొద్దిగా నీటిని తాగించాలి. పిల్లలకు వాడే గిన్నెలు, చెంచాలు ప్రతీ రోజూ వేడినీటిలో మరిగించడం అనేది చాలా అవసరం.

ఒకేసారి ఎక్కువ ఆహారం పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. పిల్లలకు 6 నెలల నుంచి ఉడికిన గుడ్డు పెట్టాలి. అయితే, అది కూడా తెల్లసొన మాత్రమే పెట్టాలి… ఎందుకంటే పచ్చ సొన త్వరగా పిల్లకు అరగదు. కాబట్టి కొన్ని రోజుల వరకూ అది పెట్టకపోవడమే మంచిదని అంటున్నారు. కూరగాయలు, పండ్లు కూడా లోపలి భాగానే పెట్టాలి. పిల్లలకు సద్ది అన్నం పెట్టకూడదు. ఎందుకంటే వారికి అరుగుదల ఉండదు.