వామ్మో.. ఎంత పెద్ద కొండచిలువో. చూశారుగా పైన ఫోటోలో ఉన్న కొండచిలువను. హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాత్రం ఏమాత్రం భయం లేకుండా ఎలా దాన్ని మెడలో వేసుకుందో చూడండి. కాజల్.. నీకు ఇంత దైర్యం ఎక్కడినుంచి వచ్చింది. దేవుడా. దాన్ని చూస్తేనే సగం చచ్చిపోయేటట్టున్నాం. నువ్వు దాన్ని మెడలో వేసుకొని కూడా అంత దైర్యంగా ఉన్నావంటే నీకు హేట్సాప్.
థాయ్‌లాండ్‌లోని ఓ అడవిలో ఇలా కాజల్ పైథాన్‌తో ఫీట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కాజల్ ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. తేజ ఆ మూవీకి డైరెక్టర్. థాయ్‌లాండ్‌లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ విరామంలో ఇలా.. కొండచిలువను మెడలో వేసుకొని ఎంజాయ్ చేసింది కాజల్. కాజల్ కొండ చిలువను మెడలో వేసుకోగా.. డైరెక్టర్ తేజ ఆ వీడియో తీశారు. దాన్ని కాజల్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.