రేపు అన్ని కంపెనీలు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి: సీఈవో

-

తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ప్రతి ఒక్కరు రేపు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. మరోవైపు రేపు అన్ని కంపెనీలు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని సీఈవో ఆదేశాలు జారీ చేశారు. సెలవు ఇవ్వని సంస్థలపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జూన్‌ 1వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధించినట్లు చెప్పారు.

తెలంగాణ పోలింగ్ నేపథ్యంలో బందోబస్తు కోసం రాష్ట్రానికి 160 కేంద్ర బలగాల రంగంలోకి దింపినట్లు వికాస్ రాజ్ తెలిపారు. 60 వేల మంది రాష్ట్ర పోలీసులు విధుల్లో ఉంటారని, కేంద్ర బలగాలు కాకుండా 72 వేల పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారని చెప్పారు. పోలింగ్‌ కోసం 87 వేలకు పైగా బ్యాలెట్‌ యూనిట్లు అందుబాటులో ఉన్నాయని, తనిఖీల్లో ఇప్పటివరకు రూ.320 కోట్ల సొమ్ము స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. తనిఖీలకు సంబంధించి 8వేలకు పైగా కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news