హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలలో శ్రీ రామనవమి ఒకటి. ప్రతి ఊరిలో శ్రీ రామనవమి సందర్భంగా ఎన్నో ఉత్సవాలను నిర్వహించడం తో పాటుగా ఇంట్లో కూడా ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తి శ్రద్ధలతో శ్రీ రాముడికి రామనవమి రోజున పూజలు చేయడం వలన ఎంతో మంచి జరుగుతుందని అందరు నమ్ముతారు. అయితే ఈ పండుగ రోజున శ్రీరాముడి కటాక్షాన్ని పొందాలంటే కొన్ని నియమాలను తప్పకుండా పాటించడం కూడా ఎంతో అవసరం. ఈ సంవత్సరం శ్రీ రామనవమి ఏప్రిల్ 6వ తేదీన రావడం జరిగింది.
శ్రీ రామనవమి రోజున రాముడిని ఆరాధించడంతో పాటు హనుమంతుడిని కూడా పూజించడం వలన ఎన్నో ప్రత్యేకమైన ఫలితాలను పొందవచ్చు. శ్రీ రామనవమి సందర్భంగా పూజ సామాగ్రితో పాటు కొన్ని ప్రత్యేక వస్తువులను ఇంటికి తీసుకురావడం వలన చాల మంచి జరుగుతుంది అని పండితులు చెబుతున్నారు. శ్రీ రామనవమికి ముందుగానే పసుపు వస్త్రాలు లేదా బంగారాన్ని ఇంటికి తెచ్చుకోవడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సంపద మరియు శ్రేయస్సును పొందవచ్చు. ఇలా చేయడం వలన ఆర్థిక సమస్యలను తగ్గించుకోవచ్చు.
అదే విధంగా ఇంటికి కుంకుమ రంగు లేదా పసుపు రంగులో ఉన్న జెండాను కొనుగోలు చేసి ప్రతిష్టించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. దీని ద్వారా కుటుంబ సభ్యులు ఆనందంగా జీవించవచ్చు. శ్రీ రామనవమికి సంబంధించి పూజ సామాగ్రిని కొనుగోలు చేయడంతో పాటు శంఖాన్ని కూడా ఇంటికి తేవడం ద్వారా సిరి సంపదలు పెరుగుతాయి అని పండితులు చెబుతున్నారు. కనుక పండుగకు ముందే శంఖాన్ని తీసుకువచ్చి పూజ గదిలో ఉంచడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు. ఈ విధంగా ఇంట్లో శ్రేయస్సు పెరుగుతుంది మరియు కుటుంబ సభ్యులందరు సంతోషంగా ఉంటారు.