సచివాలయంలో అగ్నిప్రమాదం.. పరిశీలించిన సీఎం చంద్రబాబు

-

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని రెండో బ్లాక్ లో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం చంద్రబాబు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలను సీఎం సీఎస్ విజయానంద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్త, ఫైర్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్, జీఏడీ సెక్రెటరీ ముఖేష్ కుమార్ మీనా వివరించారు.

ఫైర్ సిబ్బంది ఇప్పటికే మంటలను అదుపులోకి తీసుకురాగా.. పవర్ బ్యాక్ అప్ కోసం బ్యాటరీలు భద్రపరిచే రూమ్ లో మంటలు చెలరేగినట్టుగా అధికారులు సీఎంకు వివరించారు. ఈ ప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టం పై కూడా చంద్రబాబు ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన రెండో బ్లాక్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత, కందుల దుర్గేశ్, ఆనం రామనారాయణరెడ్డి పేసీలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news