గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ అయ్యింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఉత్తర్వులు సైతం వెలువడిన విషయం తెలిసిందే. గ్రూప్ -1 ఉద్యోగాల భర్తీలో తమకు అన్యాయం జరుగుతోందని కొందరు సుప్రీం కోర్టు మెట్లు ఎక్కగా.. సర్వోన్నత న్యాయస్థానం వాటిని తోసిపుచ్చినట్లు తెలిసింది.
ఈ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. గ్రూప్-1లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. తెలంగాణ గ్రూప్ -1 మెయిన్స్ ఫలితాల్లో ఒకే పరీక్షా కేంద్రం నుంచి 74 మంది సెలెక్ట్ అవ్వడం, అందులో 30 మంది ఓసీలు ఉండటంపై కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని మల్లన్న ఆరోపించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. దీనిపై టీజీపీఎస్సీ, ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.