కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన మెగాబ్రదర్, జనసేన నాయకులు నాగబాబుకు నిరసన సెగ తగిలింది.శనివారం ఉదయం ఆయన పిఠాపురంలో పర్యటించారు.ఈ సందర్భంగా నాగబాబుకు టీడీపీ కార్యకర్తల నుంచి నిరసన సెగ ఎదురైంది.
నియోజకవర్గంలోని కుమారపురంలో అభివృద్ధి కార్యక్రమానికి వెళ్లిన నాగబాబును తెలుగుదేశం పార్టీ నేతలు చుట్టుముట్టారు. జై వర్మ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో జనసేన కార్యకర్తలకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. నాగబాబు పర్యటనకు పిఠాపురం టీడీపీ ఇంచార్జ్ వర్మ దూరంగా ఉన్నట్లు సమాచారం. కాగా, నాగాబాబు గతంలో వర్మను ఉద్దేశించి పరోక్షంగా పలువ్యాఖ్యలు చేయగా.. కావాలనే నేడు ఆయనకు నిరసన సెగ తగిలేలా చేశారని జనసైనికులు ఆరోపిస్తున్నారు.