హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో గల కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల ప్రభుత్వ భూమి వేలం వేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఓ వైపు విద్యార్థులు, మరోవైపు ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అందులోని అరణ్యాన్ని నరికివేతపై సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతానికి ఆ భూముల్లో ఎటువంటి పనులు చేపట్టరాదని సుప్రీంకోర్టు స్టే విధించగా.. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆదివారం కంచె గచ్చిబౌలి భూములపై బహిరంగ లేఖ రాశారు. విద్యార్థులకు తోడుగా తాను నిలబడతానని.. పర్యావరణవేత్తల ప్యాషన్‌కి సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పారు. హెచ్‌సీయూ వివాదంపై కోట్లాడేందుకు ప్రజల మద్దతును కోరుతున్నానంటూ కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.
కంచ గచ్చిబౌలి భూములపై కేటీఆర్ బహిరంగ లేఖ
విద్యార్థులకు తోడుగా నేను నిలబడతాను
పర్యావరణవేత్తల ప్యాషన్‌కి సెల్యూట్ చేస్తున్నాను.
ప్రజల మద్దతును కోరుతున్నాను అంటూ కేటీఆర్ బహిరంగ లేఖ pic.twitter.com/GRrrF9jiPb
— Telugu Scribe (@TeluguScribe) April 6, 2025