సీఎం రేవంత్ రెడ్డి మీద మాజీ మంత్రి, సిద్ధిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో బీసీ బిల్లులకు ఆమోదం పొందాక.. బీసీ రిజర్వేషన్ల అమలుకు కేంద్రం ఆమోదం కోసం సీఎం రేవంత్ అండ్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలతో జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన చేపడితే రాహుల్ గాంధీ రాలేదని హరీశ్ రావు గుర్తుచేశారు.
అంతేకాకుండా, సీఎం రేవంత్‌కు రాహుల్ గాంధీ అపాయిట్మెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు.కానీ, మరుసటి రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడిని పిలించుకొని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఫోటోలు దిగారని అన్నారు. రేవంత్ రెడ్డికి మాత్రం ఢిల్లీ తలుపులు కూడా తెరుస్తలేరని ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు చేశారు.