తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్. ఇవాళ తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేసి ఉన్నారు. దీంతో టోకెన్ లేని తిరుమల భక్తులకు సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 62 వేల 76 మంది భక్తులు దర్శించుకున్నారు.

అదే సమయంలో నిన్న ఒక్కరోజే 23699 మంది తలనీలాలు సమర్పించారు. అలాగే నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.27 కోట్లు గా నమోదు అయింది. ఇక ఇవాల్టి నుంచి సోమవారం వరకు తిరుమల శ్రీవారి భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.