అక్క, అన్నపై తమ్ముడు కత్తితో దాడి.. ఒకరు మృతి

-

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో దారుణం వెలుగుచూసింది. సొంత అన్న, అక్కపై తమ్ముడు కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన చాదర్‌ఘాట్ పీఎస్ పరిధిలోని ఓల్డ్ మలక్‌పేట్‌లో గల శ్రీ వెంకటరమణ అపార్ట్‌మెంట్‌లో గురువారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది.

అక్క లక్ష్మీ, అన్నపై తమ్ముడు మదన్ బాబు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన లక్ష్మీ మృతి చెందగా.. అన్న గాయపడ్డాడు. ప్రస్తుతం అన్న ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. కుటుంబ కలహాల వల్లే ఈ ఘటన జరిగినట్లు పోలీసుల అంచనా వేస్తున్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news