కాసేపట్లో గోరంట్ల మాధవ్ ను కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు

-

వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి భార్య వైయస్ భారతి ని తిట్టిన కిరణ్ ను కొట్టబోయి ఇరుకునపడ్డారు గోరంట్ల మాధవ్. తాజాగా అతన్ని పోలీసులు అరెస్టు చేసి… జైలుకు తరలించారు. ఏపీలోని నల్లపాడు పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం గోరంట్ల మాధవ్ ఉన్నారు.

Police will produce Gorantla Madhav in court soon

చేబ్రోలు కిరణ్ పైన దాడి చేసిన కేసులో నిన్న గోరంట్ల మాధవ్ అరెస్ట్ అయ్యారు. అయితే… మరికాసేపట్లోనే గోరంట్ల మాధవ్ను కోర్టులో కూడా ప్రవేశపెట్టబోతున్నారు పోలీసులు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు.

కాగా వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ అరెస్ట్ అయ్యారు. చేబ్రోలు కిరణ్ కుమార్‌ మీద దాడి చేసిన వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ కుమార్‌ను అరెస్ట్ చేసి మంగళగిరి తీసుకెళ్లారు పోలీసులు.

 

Read more RELATED
Recommended to you

Latest news