నేడు సిరిసిల్లలో ముగ్గురు మంత్రుల పర్యటన

-

తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఇవాళ సిరిసిల్లకు వెళ్లనున్నారు. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లాకు ముగ్గురు మంత్రులు… వెళ్తున్నారు. సిరిసిల్లలో ఉన్న ఆపేరల్ పార్కులో టెక్స్ పోర్టు యూనిట్ ను ఇవాళ తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అలాగే పొన్నం ప్రభాకర్ ముగ్గురు ప్రారంభించబోతున్నారు.

thummala

 

ఈ గార్మెంట్ రంగంలో… 2000 మందికి ఉపాధి కల్పించబోతున్నారు. వాస్తవానికి కెసిఆర్ ప్రభుత్వంలోనే ఈ అపేరల్ పార్క్… ఏర్పాటు చేశారు. అయితే తుది దశకు వచ్చేసరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోనే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వస్తున్నారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news