బ్రేకింగ్ ; మహిళలు కోసం ప్రత్యేక మద్యం దుకాణాలు, ప్రభుత్వం నిర్ణయం…!

-

ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గాని మన దేశంలో ఆడవాళ్ళు మద్యం సేవించడం అనేది ఒక పాపంగా భావిస్తూ ఉంటారు అనేది వాస్తవం. “మగాడు మందు తాగి పాడు చేస్తే ఆడది ఇల్లు చక్కబెట్టాలి” ఈ మాట మన గ్రామాల్లో ఎక్కువగా వినపడుతూ ఉంటుంది. అందుకే ప్రభుత్వాలు కూడా మద్యపాన నిషేధం అనగానే ఇల్లాలి కన్నీరు అనే మాట మాట్లాడుతూ ఉంటారు. అందుకే మద్యపాన నిషేధం విషయంలో కఠినం గా ఉంటారు కొందరు.

మగాడు అంటే ఎన్నో కష్టాలు పడతాడు కాబట్టి తాగుతాడు. ఆడాళ్ళకి ఆ బాధలు ఉండవు కాబట్టి దూరంగా ఉండాలి. కాని ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆడాళ్ళకి కూడా మద్యం అందుబాటులో ఉంచే విధంగా అడుగులు వేయడం ఆశ్చర్యంగా మారింది. వారు ఇష్టపడే మందునే అందించే విధంగా ప్రయత్నాలు చేస్తుంది. మధ్యప్రదేశ్ లోని ముఖ్యమంత్రి కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆడవాళ్ళ కోసం మద్యం షాపులు తెరవాలని భావిస్తుంది.

ఈ నేపధ్యంలోనే తొలిదశలో భోపాల్, ఇండోర్, జబల్పూర్, గ్వాలియర్‌లో మహిళలకు ప్రత్యేక వైన్ షాపులు పెట్టాలని భావిస్తున్నారు. మహిళలు ఎక్కువగా ఇష్టపడే ఫారెన్ లిక్కర్ మాత్రమే అక్కడ అందుబాటులో ఉంచుతుంది రాష్ట్ర ప్రభుత్వం. మహిళల వైన్ షాపుల్లో కేవలం విస్కీ, వైన్ మాత్రమే ఉంటాయి. బీర్లు, చీప్ లిక్కర్ ఉండదు. అది కూడా ఫారెన్ బ్రాండ్స్ వరకే అమ్మాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అంటే ధరలు ఎక్కువగా ఉన్న మద్యం మాత్రమే అక్కడ అమ్ముతారు. రాష్ట్రంలో తయారు చేసే మద్యాన్ని ప్రమోట్ చేసేందుకు భోపాల్, ఇండోర్, జబల్పూర్, గ్వాలియర్‌లో వైన్ ఫెస్టివల్స్ నిర్వహించే విధంగా అడుగులు వేస్తుంది. ద్రాక్షపళ్లతో రాష్ట్రంలో తయారు చేసే మద్యాన్ని ప్రమోట్ చేసేందుకు 15 టూరిస్ట్ ప్రాంతాల్లో ప్రత్యేకంగా దుకాణాలు తెరుస్తుంది అక్కడి ప్రభుత్వం. కొత్త మద్యం పాలసీ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుండగా 15 శాతం ధరలు పెరిగే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news