కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అంబేద్కర్ ని అవమానిస్తోందని.. అంబేద్కర్ విగ్రహానికి వేసిన తాళాలు ఇప్పటికైనా తొలగించాలని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి బీ.ఆర్. అంబేద్కర్ ను అవమానిస్తే.. ఉన్నదని నాటి నెహ్రు నుంచి నేటి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిల వరకు అడుగడుగునా అవమానాలకు గురి చేస్తుందని మండిపడ్డారు.
అంబేద్కర్ అంటే కాంగ్రెస్ నాయకులకు అంత అలుసా..? అని ప్రశ్నించారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం మాట్లాడారని.. రాజకీయ సోయి ఉన్న ఎవరైనా అంబేద్కర్ పలానా వర్గానికి చెందిన వాడు అని మాట్లాడరు అని ఫైర్ అయ్యారు. అంబేద్కర్ లేకుంటే ఈ రాజకీయ వ్యవస్థ పార్లమెంటరీ వ్యవస్థ, పరిపాలన వ్యవస్థలు లేనే లేవని ఆనాడు అంబేద్కర్ సమసమాజ స్థాపన కోసం దేశ ఔన్నత్వాన్ని పెంచడం కోసం చాలా ఆదేశాల రాజ్యాంగాలను క్రోడీకరించి ఈ దేశ రాజ్యాంగం రాసి మన చేతిలో పెట్టారని పేర్కొన్నారు.