భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు ఘోర అవమానం జరిగింది.ఏపీలోని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలో అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పుల దండ వేశారు.
అది గమనించిన అంబేడ్కరిస్టులు, దళిత సంఘాలు రోడ్డెక్కి తీవ్ర ఆందోళనలు చేపట్టారు.నిందితులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల డిమాండ్ చేస్తున్నాయి. సమస్య తీవ్రతను గుర్తించిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.