ఈ మధ్యకాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వాటిలో రక్తపోటు కూడా ఒకటి. అధిక రక్తపోటు వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా గుండెకు సంబంధించిన సమస్యలు సాధారణంగా మారతాయి. అలాంటప్పుడు డాక్టర్ సూచనల ప్రకారం మెడికేషన్‌ను తీసుకోవడం తో పాటు కొన్ని జాగ్రత్తలను పాటించాలి. ముఖ్యంగా వంటలో వినియోగించే ఉప్పును తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. సోడియంను ఎక్కువగా తీసుకోవడం వలన రక్తపోటు మరింత పెరిగిపోతుంది మరియు ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అధిక రక్తపోటుతో బాధపడుతుంటే పొటాషియం ఎక్కువగా ఉండే పండ్లను, కూరగాయలను తీసుకోవాలి.
ఇలా చేయడం వలన శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది. ముఖ్యంగా అరటి పండ్లు, పాలకూర వంటి ఆహార పదార్థాలను తప్పకుండా తీసుకోవాలి. ఇలా చేయడం వలన రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది. అధిక రక్తపోటుతో బాధపడుతుంటే ఒత్తిడిని అస్సలు తీసుకోకూడదు. ఎలాంటి కారణం వలన అయినా ఒత్తిడి పెరిగితే మెడిటేషన్ వంటివి ప్రయత్నించి రక్తపోటును తగ్గించుకోవాలి. శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా అవ్వడానికి మరియు ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి మంచినీరును తీసుకోవడం ఎంతో అవసరం. ఎప్పుడైతే హైడ్రేటెడ్‌గా ఉంటారో, బిపి కంట్రోల్‌లో ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు.
సహజంగా రక్తపోటు సమస్యతో బాధపడేవారు వ్యాయామాలను చేయడం మానేస్తారు. అలా కాకుండా క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామాలను చేయడం వలన గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అంతేకాకుండా రక్తపోటు కూడా కంట్రోల్‌లో ఉంటుంది. దీనితో ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. రోజువారి ఆహారంలో భాగంగా వెల్లుల్లిని తీసుకోవడం వలన రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది. అంతేకాకుండా క్రమం తప్పకుండా వెల్లుల్లిని తీసుకుంటే రక్తపోటు తగ్గే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దీనితో గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. ఎప్పుడైతే బరువును కంట్రోల్‌లో ఉంచుకుంటారో, రక్తపోటు కూడా కంట్రోల్‌లో ఉంటుంది. కనుక బరువు తగ్గడానికి ప్రయత్నించండి. ఇటువంటి జాగ్రత్తలను పాటిస్తే రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది.