తిరుపతిలో హైటెన్షన్..నెలకొంది. టీటీడీ గోశాల అంశంలో టీడీపీ, వైసీపీ పరస్పర సవాళ్లు కొనసాగుతున్నాయి. ఇవాళ కచ్చితంగా గోశాలకు వస్తానన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. ఇక కరుణాకర్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరించారు. గోశాలకు వెళ్లకుండా భూమన కరుణాకర్ రెడ్డిను పోలీసులు అడ్డుకున్నారు.

పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు భూమన కరుణాకర్ రెడ్డి. ఇలా పోలీసుల ద్వారా అడ్డుకోవడం అయితే చేతకాని సవాళ్లు చేయడం ఎందుకు ? అంటూ ఫైర్ అయ్యారు భూమన కరుణాకర్ రెడ్డి.
టీడీపీ నేతల ఛాలెంజీపైనే నేను స్పందించానాని… నన్ను రమ్మని వాళ్లే నిర్బంధించడం ఎంత వరకు న్యాయం? అంటూ ఆగ్రహించారు. టీడీపీ నేతలు గోశాల వద్ద ఉన్నప్పుడే నన్ను అనుమతించాలని కోరారు. నేను ఒక్కడినే రావడానికి సిద్ధం.. TDP నేతలు వెళ్లిపోయాక అనుమతిస్తే ఏం ఉపయోగం? అంటూ ఆగ్రహించారు.