కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ప్రధాన మోడీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక విజ్ఞప్తి చేశారు.కంచ గచ్చిబౌలి భూముల్లో జరిగిన ఆర్థిక అక్రమాలపైన విచారణ చేపట్టి కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలని ప్రధానికి కేటీఆర్ సూచన చేశారు. రేవంత్ రెడ్డి చేసిన విధ్వంసం పైన ప్రధానమంత్రి మాట్లాడింది కేవలం బూటకం కాకుంటే చర్యలు తీసుకోవాలి కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కంచ గచ్చిబౌలి భూముల్లో రూ.10 వేల కోట్ల ఆర్థిక మోసానికి పాల్పడిందని.. ఇప్పటికే CBI, SEBI, RBI సంస్థలకు ఆధారాలతో సహా కాంగ్రెస్ చేసిన రూ.10వేల కోట్ల ఆర్థిక మోసం గురించి తెలియజేశామన్నారు. సుప్రీంకోర్టు పంపించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ కూడా ఈ అంశంలో ఆర్థిక అవకతవకలు జరిగిన అంశాన్ని నిర్ధారించిందని..కంచ గచ్చిబౌలిలో చేసిన పది వేల కోట్ల ఆర్థిక అక్రమాలపైన వెంటనే కేంద్రం విచారణ చేపట్టాలని ప్రధాని మోడీని కేటీఆర్ రిక్వెస్ట్ చేశారు.
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ప్రధాన మోడీకి కీలక విజ్ఞప్తి చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కంచ గచ్చిబౌలి భూముల ఆర్థిక అక్రమాల పైన విచారణ చేపట్టి కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలని ప్రధానికి కేటీఆర్ సూచన
రేవంత్ రెడ్డి చేసిన విధ్వంసం పైన ప్రధానమంత్రి… pic.twitter.com/rlpu21Y0q9
— Telugu Scribe (@TeluguScribe) April 18, 2025