కరీంనగర్ జిల్లా రేణిగుంట టోల్ గెట్ వద్ద ఆర్టీసీ బస్సు.. బీభత్సం సృష్టించింది. ఓ కారును గట్టిగా వెనుక నుంచి ఢీ కొట్టింది ఆర్టీసీ బస్సు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హైదరాబాదు నుంచి కరీంనగర్… వెళ్లదారిలో రేణిగుంట టోల్ గేట్ ఉంటుందన్న సంగతి తెలిసిందే.

అయితే ఈ టోల్ గేట్ రాకముందు ఒక కారును ఓవర్టేక్ చేసే… హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో కారు వెనుక అద్దాలు ధ్వంసం అయ్యాయి. అయితే కారు డ్రైవర్…. చాకచక్యంతో కారును సైడ్ తీసుకున్నాడు. అయితే ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం తోనే ఈ ప్రమాదం జరిగినట్లు చెబు తు న్నారు స్థానికులు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు.. చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లా రేణికుంట టోల్గేట్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం
ఓ కారును ఢీకొట్టిన ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సు
సీసీటీవీ కెమెరాలో రికార్డైన ప్రమాద దృశ్యాలు
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే చోటు చేసుకున్న ప్రమాదం#BusAccident #Karimnagar #Telangana pic.twitter.com/LeheX2jKC8
— PulseNewsBreaking (@pulsenewsbreak) April 19, 2025