మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గత ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన తప్పులను మరోసారి ఎత్తి చూపించారు. ఆయన తీసుకున్న నిర్ణయాల వలన ఎంత మంది ఇబ్బందులకు గురయ్యారో అని చెప్పుకొచ్చారు. శనివారం ఉదయం తన నియోజక పరిధిలో ఏర్పాటు చేసిన భూభారతి సదస్సులో కేసీఆర్ మీద సంచలన ఆరోపణలు చేశారు.
కేసీఆర్కు అర్ధరాత్రి ఓ ఆలోచన వచ్చిందని.. తాను చెప్పిన వ్యక్తికి వీఆర్వో భూ బదాలాయింపు చేయలేదని.. రాత్రికి రాత్రే VRO వ్యవస్థను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. మాట వినలేదని 23 వేల మందిని కేసీఆర్ ఉద్యోగాల నుంచి తొలగించారని.. అందుకు అవినీతి అనే పేరు చూపించారన్నారు. ఆ దొరకు అర్ధరాత్రి వచ్చిన ఆలోచనతో 23 వేల మంది రెవెన్యూ ఉద్యోగులను నడిరోడ్డు మీద పడేశారన్నారు.మంత్రి పొంగులేటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.